బాలుర ఎస్సీ వసతి గృహాంలో బుధవారం రాత్రి వ్యవసాయాధికారి ప్రసాద రావు బస చేసారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వన్ ఆఫీసర్ ఒన్ ఇన్స్టిట్యూట్ మేరకు బాలుర వసతి గృహాన్ని సందర్శించి పరిస్థితులను గమనించారు. బాత్ రూమ్స్, టాయిటెల్స్, ఇతర మౌళిక వనతులపై అధ్యయనం చేసారు. విద్యార్థులతో మాట్లాడి వారి మనోభావాలను గమనించి, వారికి ఎ సబ్జెక్టు పట్ల అసక్తి ఉన్నది అనే విషయాలను తెలుసుకున్నారు. భోజనం చేసారు. ప్రహరీ గోడ లేక పోవటం, మురుగు పోవుదారి లేక పోవటం వంటి మౌళిక వనతులు లేమి గమనించారు. వార్డెన్ నరసింహారావు, సిబ్బంది సుబ్బారావు, మార్క్ మార్క్, లక్ష్మి నాయక్ పాల్గొన్నారు.



