బేగంపేట డిసెంబర్ 10
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని మహంకాళి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మహంకాళి పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్డి రోడ్ ముగ్ధ షాపింగ్ మాల్ సిబ్బందికి మరియు కస్టమర్లకు సైబర్ క్రైమ్ గురించి వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు టోల్ ఫ్రీ నెంబర్ 1930 యొక్క ప్రాముఖ్యత గురించి విపులంగా వివరించారు. ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడినట్లయితే జరిగిన వెంటనే దగ్గర లోని పోలీస్ స్టేషను లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.
