ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి

రైతులు ఖరీఫ్ పండించిన వరి ధాన్యాన్ని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్దతు కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని జిల్లా వ్యవసాయాధికారి (జెడీఏ) శ్రీనివాన రావు కోరారు. లక్కవరంలో రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన మద్దతు కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం పరిశీలించారు. తేమ శాతం 17 ఉండేలా ఆర బెట్టుకుని జల్లెడ వేసుకుని నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా రైతులు చూసుకోవాలని, ప్రభుత్వ మద్దతు ధరకు సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. మండలంలో డిశంబర్ మూడవ వారంలో 374 ఎకరాలు, 4వ వాకంలొ 650 వరకు వరి పంట కోతకు వస్తుందని ఏవో ప్రసాద రావు చెప్పారు. రైతుల అవసరాలు పోను, మిగిలినవి మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. రైతు సేవా కేంద్రంలో వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తూము లక్ష్మి రెడ్డి, బొడ్డు హనుమా రెడ్డి, విఏఏ బార్గవి, సొసైటీ సీఈఓ ఎన్ శ్రీనివాస రెడ్డి లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *