మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్స్
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ పిలుపు మేరకు తాళ్లూరు మండల ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ గురువారం ఎంపీడీఓ అజిత కు వినతి పత్రం అందించారు. 19 సంవత్సరాలుగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గ్రామీణ సుస్థిరత, శాశ్విత వనరులు ఏర్పాటుకు కృషి చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ కనీసం వేతనం రూ.25 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భత్రత కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు తీర్చుతారని భావించారని కాని గత ప్రభుత్వం వలే ఫీల్డ్ అసిస్టెంట్స్ తొలగింపు జరుగుతుందని దీనివలన ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. మాన్ డేన్ విధానం రద్దు చెయ్యాలని, మండల స్థాయిలో బదిలీ సౌకర్యం కల్పించాలని, అప్లోడ్ నర్వర్ లోపాలని నరిదిద్దాలని, విధినిర్వహణలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా రూ. 25 లక్షలు కల్పించాలని అర్హత, అనుభవం బట్టి పదోన్నతి ఇవ్వాలని కోరారు. ప్రక్క గ్రామాలలో చేయించిన పనిదినాలను వర్క్ చేయించిన ఎఫ్ ఏలకు కలిపాలని అన్నారు. 5 బిజీ నెట్ వర్క్ వాడుతున్న సందర్భంగా కొత్త మొబైల్స్, 5 జిబి సిమ్ కార్డ్స్ ఫీల్డ్ అసిస్టెంట్స్ కు ఇవ్వాలని కోరారు. కూలీలకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.
