హైదరాబాద్ డిసెంబర్ 12
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 266 దరఖాస్తులు అందాయి.
వీటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 80, రెవెన్యూ శాఖకు సంబంధించి 17, ఇందిరమ్మ ఇండ్ల కోసం 98, మున్సిపల్ శాఖకు 13, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 57 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.
చిన్నారెడ్డిని సన్మానించిన ఆర్టీసీ ఉద్యోగులు.
వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించిన తమను తిరిగి ఉద్యోగాలు ఇప్పించాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిని కోరారు. ఈ మేరకు ఉద్యోగులు వినతి పత్రాన్ని అందజేశారు. డ్రైవర్స్, కండక్టర్స్, సెక్యూరిటీ గార్డ్స్, మెకానిక్లు సహా పలు ఉద్యోగాలు చేస్తున్న సమయంలో చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాలు కోల్పోయిన విషయం వారు చిన్నారెడ్డి దృష్టికి తెచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ చిన్నారెడ్డిని సన్మానించారు. తానే స్వయంగా ఆర్టీసీ ఎం.డీ. ని కలిసి న్యాయం జరిగేలా చూస్తానని చిన్నారెడ్డి భరోసా ఇచ్చారు.
