రజానగరం మేజర్ చివరి ఆ యకట్లు (29 మైలు రాయి వరకు) వారం రోజు లపాటు నిరవధికంగా నీటి విడుదల చేసి రైతాంగం వేసిన పంటలు నష్టపోకుండా చర్యలు చేపట్టినట్లు ఎన్ఎస్పీ ఈఈ యు.విజయలక్ష్మి తెలిపారు. కుంకుపాడు వెళ్లే మార్గంలో గత రాజానగరం మేజర్ కాలువ నీటి పరిమాణాన్ని ఎన్ఎస్పి అధికా రులు శుక్రవారం పరిశీలించారు. రైతాంగం మాట్లాడుతూ ఇప్పటి వరకు రజాన గరం మేజర్ 29 వ మైలు రాయి వరకు నీటి విడుదల కాలేదని అధికారులకు విన్నవించారు. రజానగరం కాలువ ఏర్పడిన తరువాత మొదటి సారిగా ఆయకట్టు చివరి దాకా నీరు రావటం సంతోషంగా వుందన్నారు. వర్షంపై ఆధారపడి పొగాకు, మిరప, మొక్కజొన్న తదితర పంటు వేశామని, వర్షాలు కువరక పోవటంతో ఆందోళన చెందామన్నారు. సాగర్ జలాలను విడుదల చేయటం వల్ల పంటలకు
నీరు పెట్టు కుంటూ కాపాడు కుంటున్నామన్నారు. వారం రో
జుల వాటు జులాలను ఇదేవిధంగా విడుదల చేస్తే పంటలకు పూర్తి స్థాయిలో నీరుపెట్ట వచ్చు న్నారు. రైతాంగం వినతులపై ఈఈ విజయలక్ష్మి స్పందించి రైతాంగం సూచన
మేరకు వారం రోజులపాటు నీరు విడుదల చేస్తామన్నారు. ఈకార్యక్రమం లో దర్శిమార్కెట్ కమిటీ డైరెక్టర్,మాజీ సర్పంచ్ షేక్ కాశీం సైదా, జేఈలు శ్రీకాంత్ రెడ్డి. వై విజయరత్నం, డిస్ట్రిబ్యూటీ కమిటీ చైర్మన్ సుబ్బారావు,వర్క్ ఇన్పెక్టర్ శ్రీనివాసరావు, శ్యాంసన్ రైతాంగం తదితరులు పాల్గొన్నారు.
