రైతాంగ అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మన్నేపల్లి సొసైటీ అధ్యక్షులు గొంది రమణారెడ్డి తెలిపారు. స్థానిక రైతు సేవాకేంద్రంలోప్రభుత్వ కల్పించిన మద్దతు ధరపై రైతులకు అ వగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా సొసైటీ అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ రైతాంగం పండించిన ధాన్యంను తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకుండా వుండేందుకు రైతు సేవా కేంద్రాలు, సొసైటీల ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యంను కొనుగోలు చేస్తున్నదన్నారు. తహసీల్దార్ బి.వి.రమణారావు మాట్లాడుతూ ఖరీప్ సీజన్లో పండించిన సన్నకారు పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. రైతాంగం దళారుల మాట లను నమ్మి తొందర పడి ధాన్యంను అమ్ముకోవదన్నారు. రైతులు పండిచినధాన్యం ను రైతుసేవా కేంద్రాలు, సొసైటీల వద్దకు తీసుకు వచ్చి అమ్ముకుంటే
ప్రభుత్వ మద్దతు ధర అందుతుందన్నారు. మండలవ్యవసాయాధికారి బి.ప్రసాద రావు మాట్లాడుతూ వరి మద్దతు ధర గ్రేడ్ రకం రూ2389లు, సాధారణ రకంరూ 2369లు వుందన్నారు. ఈకార్యక్రమంలో విఏఏ సాయి, రైతులు తదితరులు పాల్గొ
న్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మద్దతు ధర తెలిపే పోస్టర్లను విడుదల చేశారు.
