ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఉత్తమ ఫలితాలు సాధ్యమని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు పేర్కోన్నారు. మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో శనివారం ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ పలు పంచాయితీలలో సర్పంచిలకు, గ్రామ కార్యదర్శులకు సరైన సమన్వయం లేక క్లావ్ మిత్ర బిల్లులతో పాటు పలు పనులు ఆలస్యం అవుతున్నట్లు చర్చ వలన వెల్లడి అయినదని ఆ విధంగా ఉండకుండా సమన్వయంతో పనిచెయ్యాలని కోరారు. జెడ్బీటీన్ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ రైతులకు కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. గ్రామస్థాయిలో చేస్తున్న కార్యక్రమాలకు స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం ముందుగా ఇవ్వాలని కోరారు. వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, సీజనల్ వ్యాదులు ప్రజలు తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విఠలాపురం నర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ యూరియా కొరత ఉన్న నేపధ్యంలో ప్రతి రైతుకు నక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విఠలాపురం పాత ఊరులో నీటి ట్యాంకు ఏర్పాటు చెయ్యాలని కోరారు. పారిశుధ్యం నిర్వహణకు పంచాయితీ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మల్కాపురం నర్పంచి వలి మాట్లాడుతూ హౌసింగ్ నిర్మాణాలు త్వరగా చేపట్టాలని కోరారు. మన్నేపల్లి సొసైటీ అధ్యక్షుడు గొంది రమణా రెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. నాగంబొట్ల పాలెం సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని సుబ్బయ్య మాట్లాడుతూ రైతులకు అవసరమైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పంచాయితీలో కోతులు, కుక్కులు, డ్రైనేజి సమస్యలు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర నాటక రంగ అకాడమీ డైరెక్టర్ ఓబులు రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు వెళ్లు దారి సిమెంట్ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఆధ్వర్యంలో ఉంచుకుని సంవత్సరాలు గడుస్తుందని, ఆ సిమెంటు ను ఇప్పిస్తే పాఠశాలకు వెళ్లు రోడ్డు వేస్తామని చెప్పారు. గత సభలో ఇదే నమస్యలు పీఆర్ ఎఈ వెంకటేశ్వర్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఇప్పటికి పరిష్కారం కాని సంగతి గుర్తు చేసారు. ఎంపీడీవో పి రజిత మాట్లాడుతూ గ్రామ కార్యదర్శులు ప్రజాప్రతినిధులను ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాలని సమన్వయంతో పనిచేసి క్లాప్ మిత్ర బిల్లులు చెల్లించాలని చెప్పారు . పారిశుధ్యం పై మీడియాలో వస్తున్న కథనాలు ఇకపై రాకూడదని అలా వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పలు అంశాలపై ప్రజా ప్రతినిధులు నిలదీసారు. పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి, ఎవో ప్రసాద రావు, ఎంపీఎం వెంకటేశ్వర్లు, పలు శాఖలు ఎఈ లు వాలి, హనుమంత రావు, రామక్రిష్ణా రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎంఈఓ నుబ్బయ్య, వైద్యులు ప్రతాప్ కుమార్ వారి శాఖల పురోగతిని వివరించారు.
నోరు మెదపని ఎంపీటీసీలు….
ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యలపై ఎంపీటీసీలు నోరు మొదప లేదు. నభ ప్రారంభానికి మాత్రమే పనికి వచ్చిన ఎంపీటీసీలు తర్వాత వారి పరిధిలోని సమస్యలను సభ దృష్టికి తేలేదు. సొసైటీ అధ్యక్షడు గొంది రమణా రెడ్డి, వల్లభనేని నుబ్బయ్య, రాష్ట్ర నాటక రంగ అకాడమి డైరెక్టర్ బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, నర్పంచిలు మారం ఇంద్రసేనా రెడ్డి, వలి, సుబ్బా రావులు మాత్రమే అనేక సమస్యలను పదే పదే సభ దృష్టికి తెచ్చారు. కోఆప్షన్ కరిముల్లా, డిప్యూటీ తహసీల్దార్ జి ఫణీంధ్ర, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, ఐసీడీఎన్ నూపర్ వైజర్ నునీత తదితరులు పాల్గొన్నారు.










