చీమకుర్తిలో లో జరిగిన జిల్లా స్థాయి భో ఖో పోటీలలో తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఎన్ సౌందర్య ప్రతిభ చాటింది. దీంతో ఈనెల 19 నుండి 21 వరకు జె పంగలూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయినది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఎస్ ఆర్ కె ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయుడు కె. శివ నాగ రాజు, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.
