ప్రజాభిప్రాయం గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం వైద్య విద్యలో పి పి పి పద్ధతిని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం ఆధీనంలోనే మెడికల్ కళాశాలలను నిర్మించాలని వైసిపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలులోని వైసిపి జిల్లా కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాభిప్రాయంతో పని లేకుండా కూటమి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పాలన సాగిస్తుందన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసిపి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాలో 5, 28 ,148 సంతకాల సేకరణ జరిగిందన్నారు. మెడికల్ కళాశాల నిర్మిస్తున్న మార్కాపురం నియోజకవర్గంలో వైద్య విద్యను ప్రైవేటీకరిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ అత్యధికంగా సంతకాల సేకరణ జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈనెల 15 సోమవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా సేకరించిన 5,26,148పత్రాలను ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో చర్చి సెంటర్ లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి, అనంతరం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించనునట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు మహిళలు, ప్రజాప్రతినిధులు, వివిధ హోదా పదవుల్లో ఉన్న వారు, పార్టీ శ్రేణులు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మార్కాపురం జిల్లా అభివృద్ధికి ఎటువంటి పరిశ్రమలు గానీ, నిధులు గాని కేటాయించకుండా ఏర్పాటు చేయటం దుర్మార్గమన్నారు. మార్కాపురం జిల్లా మరో వెతుకు పడింది జిల్లాల జాబితాలో చేరుతుందన్నారు. దర్శి నియోజకవర్గాన్ని ఏ జిల్లాలో ఉంచాలో అనే విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి, ప్రజల అభీష్టం మేరకు నడుచుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయమ్మ , ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆదెన్న, ఒంగోలు పార్లమెంట్ రాష్ట్ర సెక్రటరీ బొట్ల రామారావు, చింతలచెర్వు సత్యనారాయణ రెడ్డి ,దుంపా చెంచురెడ్డి, ఉప్పలపాటి ఏడుకొండలు (వేణు), గోనుగుంట రజిని,కూనం గౌతమ్, రాయని వెంకటరావు,పెట్లూరు ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, సయ్యద్ అప్సర్, షైక్ మీరావళి తదితరులు పాల్గొన్నారు.
