బేగంపేట డిసెంబర్ 15(జే ఎస్ డి ఎం న్యూస్) :
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటీవల డీ లిమిటేషన్ లో జరిగిన తప్పిదాలను వెంటనే సరిచేయాలని బి ఆర్ ఎస్ ప్రతినిధి బృందం నార్త్ జోన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా, బన్సీలాల్ పేట, రాంగోపాల్ పేట, బేగంపేట డివిజన్ లకు చెందిన కార్పొరేటర్ లు, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు సోమవారం సికింద్రాబాద్ లోని డి సి డాకు నాయక్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల జి హెచ్ ఎం సి పరిధిలో చేపట్టిన డీ లిమిటేషన్ లో నూతన డివిజన్ ల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న డివిజన్ ల సరిహద్దుల గుర్తింపు అంతా తప్పుల తడకగా, గందరగోళం గా ఉందని డి సి కి వివరించారు. కొన్ని బస్తీలు, కాలనీలు రెండు మూడు డివిజన్ లలో విలీనం చేశారని, దీనివలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాల మేరకు డివిజన్ ల విభజన చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో బన్సీలాల్ పేట కార్పొరేటర్ కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, పద్మారావు నగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, తలసాని స్కైలాబ్ యాదవ్, శ్రీహరి, లక్ష్మీపతి, నాగులు, కిషోర్, ఏసూరి మహేష్, ఆంజనేయులు, ప్రేమ్, శ్రీకాంత్ రెడ్డి,తదితరులు ఉన్నారు.

