బస్సులో సెల్ పోగొట్టుకున్న మహిళ తన సెల్ ఫోన్
ట్రాక్ చేసి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించగా రెండు గంటలు వ్యవధిలో సెల్ ఫోన్ ట్రాక్ చేసి అందజేసారు. దీంతో పోలీసుల సేవలపై ఆ మహిళ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. వివరాలలోనికి వెలితే…. తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామానికి చెందిన పోలేబోయిన రమణ తన కుమారుడుతో కలసి దర్శి నుండి వస్తూ ముండ్లమూరులో దిగింది. ఆ బస్సులో సెల్ పొరపాటున పోగొట్టుకున్నది. క్రిందకు దిగి చూసుకున్న తల్లి కుమారుడు చరణ్ సెల్ మిస్ అయనదని తెలిసి తక్షణమే బస్సును వెంబడించి అద్దంకి డిపోకి వెళ్లి చూడగా అప్పటికే ప్రయాణికులు దిగి పోయారు. దీంతో ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ ను అడగగా, సెల్ ఎమి తమకు ప్రయాణికులు ఇవ్వలేదని చెప్పారు. దీంతో తాళ్లూరు ఇన్చార్జి ఎస్సై కమలాకర్ దృష్టికి ఆమె భర్త కొండలు తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎస్సై సెల్ నంబర్ తో
ట్రాక్ ను కనుగొని వినుకొండ వద్ద నాగుల వరం వద్ద సెల్ ఉన్నదని చెప్పారు. దీంతో తాళ్లూరు హెడ్ కానిస్టేబుల్ కొండలను సిబ్బందిని పంపి సెల్ ను ట్రాక్ చేయించాని ఆదేశించారు. దీంతో ఆయన హోమ్ గార్డ్ శ్రీనివాస్ ను పురమాయించారు. శ్రీనివాస్, బాధితులతో కలసి నాగుల వరం వెళ్లి సెల్ ట్రాక్ అయి ఉన్న నివాసంలో విచారించగా తమకు బస్సులో సెల్ దొరికిందని, ఎవరూ అయినా అడిగితే ఇవ్వాలని అలాగే ఉంచామని చెప్పారు. దీంతో సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని బాధితులను అందించారు. గంటల వ్యవధిలో విలువైన సమాచారం ఉన్న సెల్ ఫోన్ , రూ. 12 వేల విలువైన తమ సొత్తు తమకు స్వాధీనం చేసినందుకు ఎస్సై కమలాకర్ కు, హెడ్ కానిస్టేబుల్ కొండలుకు, సిబ్బంది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. తక్షణమే స్పందించిన ఎస్సైకు ధన్యవాదాలు చెప్పారు. పోలీసుల తక్షణ స్పందనపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.
రెండు గంటల వ్యవధిలో మహిళ సెల్ నుట్రాక్ చేసి అందజేసిన ముండ్లమూరు ఎస్సై కమలాకర్ – కృతజ్ఞతలు తెలిపిన మహిళ, బంధువులు
16
Dec