ఏపీయూడబ్యుజే ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెవి సురేష్ కుమార్ రెడ్ది
తండ్రి కోట వెంకట రామి రెడ్డి (74) సోమవారం మృతి చెందారు. ఆయన మృత దేహాన్ని ఎపీయూడబ్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బా రావు, ఎపీయూడబ్యుజే జిల్లా అధ్యక్షుడు ఎన్ వి రమణ, ఎపీయూడబ్యుజే నాయకులు ఎం శ్రీనివాస రావు, కూటాల శ్రీనివాసరావు, నునుర్ల నరేంద్ర నాథ్, తూము శ్రీనివాస రెడ్డి సందర్శించి ఘన నివాళు లు అర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ నుబ్బా రావు పూల మాలలు వేసి నివాళులు అర్పించి, కెవీ సురేష్ కుమార్ రెడ్డి కి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా కెవీ సురేష్ కుమార్
రెడ్డిని ఫోన్ లో వైసీపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్
జగన్ మోహన్ రెడ్డి, మంత్రి గొట్టి పాటి రవికుమార్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ సీఎం వైయస్ జగన్ ప్రొగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘ రామ్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్ది, ఎపీయూడబ్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశాలాంధ్ర బ్యూరో ఎ సురేష్ కుమార్, జిల్లాలోని అధిక సంఖ్యలో జర్నలిస్ట్లు , ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

