నాగులుప్పలపాడు మండలములోని బి నిడమనూరు లోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహము ను మంగళ వారము రాత్రిజిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మా నాయక్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వంట గదిని, తాగునీటి వసతులను, మరుగుదొడ్లను, స్టోర్ గదిని పరిశీలించారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా , ప్రతి నెలా వైద్యులు వస్తున్నారా లేదా, వారి ఆరోగ్య పరిస్థితులు, కల్పిస్తున్న వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మాకు వసతులు బాగున్నాయని, ప్రతినెలా వైద్యులు వచ్చి పరీక్షలు చేసి వెళతారని డిప్యూటీ డైరెక్టర్ కు చెప్పడం జరిగింది. జిల్లాడిప్యూటీ డైరెక్టర్ విద్యార్థులతో కలసి భోజనం చేయడం జరిగింది చికెన్ భగార అన్నం విద్యార్థులకు భోజనం మెనూ ప్రకారం పెట్టారు.విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించరాదని వసతి గృహం సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ రోజు బాలుర వసతి గృహము ను పరిశీలించడం జరిగిందన్నారు. వసతులు, భోజనం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వసతి గృహం లో మొత్తం 128 మంది విద్యార్థులు ఉన్నారు.
వసతిగృహ సంక్షేమాధి కారి ప్రభుదాస్ హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.


