బేగంపేట డిసెంబర్ 17
(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
అయ్యప్ప స్వాములకు శ్రీ స్వామియే శరణమయ్యప్ప మిత్ర బృందం ఆధ్వర్యంలో నిత్య అన్నదానం నిర్వహించడం అభినందనీయమని బీ ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షుడు పొన్న బోయిన సురేష్ యాదవ్ అన్నారు.బేగంపేట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ లో శ్రీ స్వామియే శరణమయ్యప్ప మిత్ర బృందం ఆధ్వర్యంలో నిత్యఅన్నదానం కొనసాగుతుంది. వందలాదిమంది అయ్యప్ప స్వాములు విచ్చేసి బిక్ష స్వీకరించారు. ఈ సందర్భంగా సురేష్ యాదవ్ మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష ఎంతో పవిత్రమైనదని అన్నారు.
మిత్ర బృందం సభ్యులు బాలరాజు , సైలేందర్ యాదవ్ పిలుపుమేరకు బుధవారం బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ యాదవ్ నిత్య అన్నదానం కార్యక్రమానికి హాజరై నిర్వహకులని ప్రశంసించారు. ఈ సందర్భంగా వారు సురేష్ యాదవ్ ను శాలువాతో సత్కరించారు.
