పెద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం చేయూత ఇస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పేర్కోన్నారు. తాళ్లూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువు చున్న 300 మంది విద్యార్థులకు బి వి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆన్ ఇన్ ఒన్ లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆన్ ఇన్ ఒన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధికి బాటలు వేసామని, నాటి నుండి పేద విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం ఆన్ ఇన్ ఒన్ లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాలకు అవసరమైన వేళ చేయూత ఇవ్వటానికి బివిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ముందు ఉంటుందని అన్నారు. అనంతరం 52 మంది విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ లో పంపిణీ చేశారు. హెచ్ఎం పి. సుబ్బా రావు, సర్పంచి మందా శ్యామ్సన్, ఉప నర్పంచి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య, నాయకులు పులి రామి రెడ్డి, పి అంజి రెడ్డి, సగిలి రోశిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఎదులూరి క్రిష్ణా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, ముచ్చుమారి బ్రహ్మా రెడ్డి, ఉపాధ్యాయులు బ్రహ్మాయ్య, శింగా రెడ్డి, సంగా రెడ్డి, షేక్ అబ్దుల్ కరీం, పిడి రవి పస్రాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




