యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ( యూ ఎఫ్ ఎన్) ఇచ్చిన లక్ష్యాల మేరకు త్వరగా పూర్తి చెయ్యాలని ఎంపీడీఓ పి అజిత కోరారు. మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో బుధవారం గ్రామ సచివాలయ ఉద్యోగులకు సర్వేపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సర్వేలో నిర్ణయించిన వివరాలను స్పష్టంగా ఇవ్వాలని, ఖచ్చితమైన సర్వే చెయ్యాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన సర్వేలను నకాలంలో పూర్తి చేసి త లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. సకాలంలో కార్యాలయానికి హాజరు అయి అందరూ అటెంటెన్స్ ఉండేలా చూసుకోవాలని కోరారు. డిప్యూటీ ఎంపీడీఓ పి శ్రీనివాస రావు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

