ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో ప్రకాశం జిల్లా నుండి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు , మరియు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు మరియు శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా నిర్వహించిన ఈ సదస్సులో జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. లా అండ్ ఆర్డర్ అంశంపై రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా మరియు హోం శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ వివరించారు. సామాన్యుడికి ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా చూడాలని, పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన దిశానిర్దేశంపై చర్చించారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు పలు అంశాలపై జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సమావేశంలో వివరించారు.
ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేస్తూ అభివృద్ధి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ లు పేర్కొన్నారు.

