దేశం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ బంగారం ఆన్ లైన్ లో దేశం మరియు విదేశాల్లో కొనుగోలు మరియు అమ్మకాలు జరుపుటకు నమోదయిన సంస్థలు, గత 5 సంవత్సరాలలో భారతీయులు కొన్న బంగారం విలువ, మొత్తం పిర్యాదులు మరియు అవగాహన కార్యక్రమాల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి, పంకజ్ చౌధరీ సమాదానమిస్తూ దేశం మరియు విదేశాలలో డిజిటల్ బంగారం ఆన్ లైన్ లో కొనుగోలు మరియు అమ్మకాలు జరిపి సంస్థలను నమోదు చేయబడలేదని, 2020 నుండి 2025 వరకు జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ (టెలిఫోన్ సేవ) ద్వారా వచ్చిన డిజిటల్ బంగారానికి సంబంధించి దేశం మొత్తంలో వినియోగదారుల నుండి 371 పిర్యాదులు రాగా, ఆంధ్రప్రదేశ్ నుండి 17 వచ్చాయని తెలిపారు. ఆన్ లైన్ డిజిటల్ బంగారం కొనుగోలు మరియు అమ్మకాలపై అవగాహన కల్పనకు ఎలాంటి కార్యక్రమాలు ప్రారంచలేదని, అయితే, భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు వారు 8-11-2025 తేదీన బంగారం సంబంధిత ఆర్ధిక ఉత్పత్తుల సమాచారం గురించి పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు హెచ్చరిక చేసిందని తెలిపారు.
భారత సెక్యూరిటీలు మరియు మార్కెట్ల బోర్డు (సెబి) వారు రిజిస్టరు చేయబడిన మధ్యవర్తి సంస్థల ద్వారానే నియంత్రత బంగారు ఉత్పత్తుల చేయాలని, సెబి గుర్తింపబడని వెలుపల సంస్థల ద్వారాచేస్తే ప్రమాదాలు ఉండునని మరియు సెక్యూరిటీ / స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల రక్షణ విదానమేదీ లేదని, అవగాహన కల్పించబడిందని కేంద్ర మంత్రి తెలియజేశారు.
సమీక్షా సమావేశం నిర్వహణ…
ఢిల్లీ లో పార్లమెంట్ హాల్ లో గృహ మరియు పట్టణవ్యవహారాల కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు మరియు అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.
