రాష్ట్రంలో మహిళలు,ఆడపిల్లల పై లైంగికదాడులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మహిళాకమిషన్ చైర్ పర్సన్ ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లోని నర్సింగ్ హాస్టల్ ను, సఖివన్ స్టాప్ సెంటర్ ను, రామ్ నగర్ లోని గృహహింస నిరోధక చట్టం కేంద్రాన్ని, బాల సదనం కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళాకమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఉందనే భరోసాను కల్పించాలని ఆమె చెప్పారు. రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్ల లకు ఆశ్రయం కల్పించ డానికి సఖి వనస్టాప్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ , ప్రైవేటు కార్యాల యాల్లో పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక దాడులుజరగ కుండాఅవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు. కళాశాలలో, పాఠశాలలో బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగా హన కల్పించాలని ఆమె చెప్పారు. మహిళలకు లైంగిక వేధింపుల చట్టాల గురించి, ఫోక్సో చట్టాల గురించి అవగాహన కల్పించా లని ఆమె చెప్పారు. రాష్ట్రంలో లైంగిక వేధింపులు తగ్గించ డానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటు న్నాయని ఆమె చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు నిర్భయం గా ముందుకు వచ్చి సమస్యను చెప్పుకో లేకపోతున్నారని ఆమె అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ కు తెలియజేయా లనిఆమె చెప్పారు. రిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న నర్సింగ్ హాస్టల్ లో 500మంది విద్యా ర్థులుఉండడానికి అసౌకర్యంగా ఉందని ప్రత్యేక భవనంలోకి మార్చాలని విద్యార్థు లు కోరన్నారు. సఖి వన్ స్టాప్ సెంటర్లో అమలు జరుగుతున్న కార్యక్రమాల గురించి చైర్పర్సన్ అధికారుల ను అడిగితెలుసు కున్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్న గృహహింస నిరోధక చట్టం కేంద్రాన్ని చైర్పర్సన్ పరిశీ లించారు. బాలసదనం కేంద్రంలో ఉన్న పిల్లలతో చైర్పర్సన్ ముచ్చ టించారు. బాల సదనం కేంద్రంలో పిల్లలతో సెమీ క్రిస్మస్ వేడుకల్లో చైర్పర్సన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళాసంక్షేమశాఖ అధికారి సువర్ణ, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ సుమిత్రా దేవి, దిశ పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి రమణ మూర్తి, మహిళాశిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


