ప్రపంచ శాంతి స్వరూపుడు ఏసుక్రీస్తు అందరికీ అనుకరణీయమని సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ అన్నారు. ఉప్పుగుండూరు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ యూత్, సంఘ పెద్దలు ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు క్రీస్తు పుట్టుక ద్వారా ప్రపంచంలోనే శాంతి నెలకొందని సమాజంలో మానవుడి నడవడికకు కావలసిన అన్ని రకాల సూక్తులు బైబిల్ లోలిఖించ బడ్డాయని దీనిని ప్రతి ఒక్కరు ఆచరిస్తే అందరికీ మేలులు జరుగుతాయని ఆయన తెలియజేశారు. క్రీస్తు చెప్పిన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. సెమీ క్రిస్మస్ ఘనంగా జరుపుకున్న తెలుగు బాప్టిస్ట్ సంఘ పెద్దలు మరియు క్రిస్టియన్ యూత్ ను ఆయన అభినందించారు.గ్రామంలోతెలుగు బాప్టిస్ట్ చర్చి కొత్తగా నిర్మాణం జరపాలని ప్రస్తుతం ఉన్నది శిధిలావస్థకు చేరిందని కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన మాట్లాడుతూ ఉప్పుగుండూరులో ఈపాటికి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలుపెట్టి జరుగుతున్నాయని అదే విధంగా సంఘ పెద్దలు కాలనీ వాసులు అందరూ ఐక్యంగా ఉంటే చర్చి నిర్మాణం చేయించే బాధ్యతను తీసుకొని సత్వరమే పూర్తి చేస్తానని సభాముఖంగా ఆయన హామీ ఇచ్చారు. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు.మండల టిడిపి పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ మాట్లాడుతూప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అని ఈ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీనియర్ జర్నలిస్ట్ గద్దె త్యాగరాజు అధ్యక్షతన జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో సంఘ పాస్టర్ డాక్టర్ రెవరెండ్ తెలగల పూడిసుధాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేయించి పంచి పెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు క్రైస్తవ గీతాలాపనలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘాల అధ్యక్షులు పాస్టర్ రెవరెండ్ తేళ్ల దైవాధీనం, సెక్రెటరీ శేఖర్ బాబు, ఏబీఎన్ డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ టి ఎస్ ఎస్,సింగ్ మాస్టర్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గద్దె శేషయ్య మాస్టారు, పాస్టర్లు ఉసురుపాటి విజయ్ కుమార్ రాఘవరావు నంబూరు భాస్కరరావు తో పాటుగా గ్రామ టిడిపి అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు సొసైటీ చైర్మన్ కాట్రగడ్డ బాబు, సొసైటీ డైరెక్టర్లు పెంట్యాల శ్రీనివాసరావు,మసి ముక్కు భాస్కర్ రావు, టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు కూతంబాకం సెల్వం, ఎస్టీ సెల్ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు, క్రిస్టియన్ యూత్ కత్తి పవన్, రాజేష్ సురేషులతో పాటుగా యూత్ సభ్యులు, క్రైస్తవ సోదరులు సోదరీమణులు పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు.

