ప్రకాశం జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధిని అందించడానికి జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు నేతృత్వంలో ప్రఖ్యాతిగాంచిన సెంచురియన్ యూనివర్సిటీ ప్రతినిధులతో శుక్రవారం ప్రకాశం భవనంలో సమావేశం జరిగింది. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ముఖ్యంగా మైనింగ్, పోర్టులు, హార్టికల్చర్, ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, హైడ్రోకార్బన్ తదితర రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేసి వీటికి ఇండస్ట్రీ కనెక్ట్ చేయడం వలన జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని ఉద్యోగాలు పొందడంలో ఎంత మేలు జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. అందులో భాగంగా త్వరితగతిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్/స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ను ఏర్పాటు చేయడానికి ప్రళాణికను సిద్ధం చేయమని జిల్లా యంత్రాంగానికి సూచించారు.
ఈ కార్యక్రమంలో సెంచురియన్ యూనివర్సిటీ ప్రతినిధి జె ఎన్ రావు , గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవితేజ, డి ఆర్ డి ఎ పి డి నారాయణ, జడ్పీ సీఈవో చిరంజీవి, జిల్లాలోని పాలిటెక్నిక్, ఐటిఐ కాలేజీల ప్రిన్సిపాల్ లు, జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

