జిల్లాలో రబీ 2025-26 సీజన్ కు అన్ని పంటలకు అవసరమైన మేర యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ . శ్రీనివాస రావు వివరించారు. యూరియా 34,878 మెట్రిక్ టన్నులు ఎరువు పంపిణీ ప్రయాణికలు ఉన్నాయని చెప్పారు. అక్టోబర్ ఒకటి నాటికి 4824 మెట్రిక్ టన్నులు ప్రారంభ నిల్వలు ఉన్నాయని చెప్పారు. ప్రకాశం జిల్లా డిశంబర్ 31 నాటికి 23,115 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఇప్పటికి 30,711 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉన్నదని, డిశంబర్ ఆఖరు నాటికి మరో 500 మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పారు. రబీ ప్రారంభం అక్టోబర్ నుండి శుక్రవారం వరకు జిల్లాలో 22,520 మెట్రిక్ టన్నులు యూరియా విక్రయాలు జరిగినట్లు తెలిపారు. డిశంబర్ మిగిలిన 11 రోజులకు 4,212 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ప్రస్తుతం 7,254 మెట్రిక్ టన్నులు యూరియా కో ఆపరేటివ్ సొసైటీలలో, అర్ ఎస్ కే మార్క్ఫెడ్, రిటైల్, హోల్ సేల్, కంపెనీ గోదాములలో ఎరువు రైతాంగానికి అందుబాటులో ఉన్నదని చెప్పారు. జిల్లా ఇప్పటి వరకు ఎటువంటి ఎరువుల కొరత తేదని చెప్పారు. దేశీయంగా ఉన్న అన్ని ఎరువుల కర్మాగారాలు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా విదేశాల నుండి కూడ యూరియా దిగుమతులు సంతృప్తి కరంగా ఉన్నాయని చెప్పారు. నూతనంగా రూపొందించబడిన సాంకేతికంగా అభివృద్ధి పరచిన నానో యూరియా, వానో డిఏపి ఎరువులను అందుబాటులోనికి తీసుకురావటం జరిగిందని చెప్పారు. ఇవి సాంప్రదాయ ఎరువులకు నూరు శాతం ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ప్రొత్సాహిస్తున్నట్లు చెప్పారు.
రైతులు కొనుగోలు చేయు సమయంలో బస్తాపై ముద్రించిన ఎంఆర్ పి ధరలను చూసుకుని దాని ప్రకారం పైకం చెల్లించి తప్పనిసరిగా డీలర్ నుండి రసీదు పొందాలని కోరారు. ఎవరైనా డీలర్లు నిబంధనలు ఉల్లంఘించిన ఎడలు, కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులు మల్లింపు చేసినా, ఎంఆర్పీ ధరల కంటే అధికంగా అమ్మినా వారి లైసెన్సు రద్దు చేయబడునని చెప్పారు. ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని వివరించారు.
