తాళ్లూరులోని బిసీ బాలికల, ఎస్సీ బాలుర వసతిగృహాలను, కస్తూర్బాగాంధీ బాలి కల విద్యాలయంను డిప్యూటీ కలెక్టర్, మండల ప్రత్యేకాధికారి ఏ.కుమార్, తహసీల్దా ర్ బి.వి. రమణారావులు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఎస్సీ బాలుర వసతి గృహం అని తెలిపే బోర్డు కూడా ఏర్పాటు చేయక పోవటంపై ఇంచార్జి వార్డెన్ తో ఫోన్లో మాట్లాడి అసంతృప్తి వ్యక్తం చేశారు. వంటశాలను సందర్శించి విద్యా ర్థులకు మెనూ ప్రకారం భోజనం తయారు చేస్తున్నదీ లేనిది పరిశీలించారు. విద్యా ర్థులకు శుక్రవారం తాలింపు రైస్, చికెన్, గుడ్డు, గోంగూర చెట్నీ తయారు చేయాల్సి వుండగా మామూలు అన్నం తయారు చేసి వుండటం, చికెన్ తయారు చేయక పోవటం, గోంగూర సెట్నీ గుడ్డు అనవాళ్లు లేక పోవటంతో సిబ్బందిపై ఆగ్రహాం
వ్యక్తం చేశారు. కావటి చికెన్ తీసుక రాగా ఎర్లీగా తయారు చేయకుండా ఆలస్యమేమిటని ప్రశ్నించారు. తాళింపు రైస్ ఎందుకు తయారు చేయలేదని, చెట్నీ, గుడ్డు ఎందుకు ఇవ్వటం లేదని సిబ్బందిని నిలదీయగా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఎస్సీ బాలుర వసతి గృహ నిర్వహణ సక్రమంగా లేక పోవటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ రమణావు విద్యార్థులచే చదివించి వారిలో వున్న సామర్ధ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం
ఏర్పాటు, విద్యార్థులు పరిశుభ్రంగా వుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
బీసీ బాలికల వసతి గృ హాన్ని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో బాలికలతో మాట్లాడారు. వసతి గృహాల వసతులను పరిశీలించారు. బీసీ బాలికల వసతి గృహంలో భోజనం ఏర్పాటు, విద్యార్థులు పరిశుభ్రంగా వుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు
ఆటలాడుకునేందుకు బాలికలు షెటిల్ కాక్ లు ఇవ్వాలని కోరగా తహసీల్దార్ ఏర్పాటు చేస్తానని బాలికలకు హామీ ఇ చ్చారు. ఈకార్యక్రమంలో ఆర్. ఐ ఎం.సుధీర్, విఆర్వో రమణారెడ్డి, ప్రిన్సిపల్ సుజిత తదితరులు పాల్గొన్నారు.



