పల్స్ పోలియోను విజయవంతం చెయ్యాలి.

ఈనెల 21 నుండి నిర్వహించనున్న పల్స్ పోలియో విజయవంతానికి కృషి చెయ్యాలని తాళ్లూరు పీహెచ్ సి
వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రాజేష్ యాదవ్ లు
కోరారు. తాళ్లూరు పీహెచ్ సి పరధిలో 0 నుండి 5 సంవత్సరాల పిల్లలు 2192 మందికి పోలియో చుక్కలు అందిచాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. 17 బూత్లు, ఒక మొబైల్, రెండు సూపర్ వైజర్స్ రూట్స్, ఒక ట్రాన్షెన్ట్ ఏర్పాటు చేసామని చెప్పారు. 22, 23 తేదీలలో 5850 నివాసాలను సందర్శించి మిగిలిన 0-5 సంవత్సరాల పిల్లలను వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీహెచ్ రమణమ్మ, హెచ్ ఎన్ రవి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *