హైదరాబాద్ డిసెంబర్ 20
(జే ఎస్ డి ఎం న్యూస్) :
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని రక్షించేందుకు సి పి ఆర్ ఎంతో అవసరం అని టీ జీ ఎస్ పి ఎఫ్ కమాండెంట్ సి. జంగయ్య అన్నారు.టీ జి ఎస్ పి ఎఫ్ డి జి ఆదేశాల మేరకు శనివారం తెలంగాణా అసెంబ్లీ ,రిజర్వ్ బ్యాంకు లో బి ఎల్ ఎస్, సీ పీ ఆర్ పై అమీర్ పేట ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి వైద్య బృందం టీ జీ ఎస్ పి ఎఫ్ సిబ్బందికి రిజర్వ్ బ్యాంకు సిబ్బందికి ,అసెంబ్లీ సిబ్బందికి సి పి ఆర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ జంగయ్య మాట్లాడుతూ సి పి ఆర్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని
రక్షించే వీలుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి,ఇన్స్పెక్టర్లు సత్తయ్య,తిరుపతి, ఎస్సైలు , ఏ ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.



