దరిశి పట్టణంలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముస్తాబు కార్యక్రమం గురుకులం ప్రిన్సిపాల్ ఎన్. మీరాసాహెబ్ అధ్యక్షత నిర్వహించారు. ముఖ్య అతిధిగా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబరు కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లడుతూ… విద్యార్థులు ప్రతిరోజూ వ్యక్తిగత పరిశుభ్రతను కలిగివుండాలని,క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని, క్రమశిక్షణ,ఆత్మ విశ్వాసం,నాయకత్వ లక్షణాలను కలిగివుండాలని, ముఖ్యంగా గురుకులాలలో, వసతిగృహాలలో వున్నవారికి తలిదండ్రుల పర్యవేక్షణ వుండదు కనుక పెద్ద పిల్లలు చిన్నపిల్లలయందు సోదరభావంతో బట్టలనుండి మొదలుకొని గోర్లు కత్తరించుకొనే వరకు అన్నీ వ్యక్తిగత పరిశుభ్రతకు సంబందించిన మెలుకువలు తెలియజేయాలని,అనారోగ్యంతో వున్నవారికి మిగితా వారందరూ సంఘీభావాన్ని తెలపాలని,చెవులు ముఖం శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, టాయిలెట్ కు వెళ్లిన తరువాత, భోజనానికి ముందు తప్పకుండా చేతులు సబ్బుతో శుభ్రం చేసుకుని మంచి ఆరోగ్య పద్దతులు అలవర్చుకోవాలని కపురం శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు
పకులు,గురుకులం సిబ్బంది పాల్గొన్నారు.

