హైదరాబాద్ డిసెంబర్ 21 (జెఎస్డిఎం న్యూస్) :
ప్రపంచంలో ని క్రైస్తవులు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రాత్రి బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయగూడ లో గల సెయింట్ ఫిలో మిన చర్చి లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, పాదర్ ప్రతాప్, పాదర్ చాల్స్, పాదర్ ఉదయ్ భాస్కర్, పాదర్ క్రాంతి, పాదర్ జరం, జయరాజ్, బాబా, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, కుమార్ యాదవ్, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.



