హైదరాబాద్ డిసెంబర్ 21(జే ఎస్ డి ఎం న్యూస్) :
లతా పేష్కర్ రచనలు చిన్నారులను స్ఫూర్తిదాయక కథలతో ప్రేరేపిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు.బేగంపేట దేవనార్ అంధుల పాఠశాలలో జరిగిన కార్యక్రమం లో ప్రముఖ రచయిత్రి లతా పేష్కర్ ను విలాస ద సైన్స్ ఆఫ్ మాక్సిన్, అశ్లీ పబ్లికేషన్ ఆద్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఫౌండర్ పసుపులేటి శ్రీవల్లి,మిస్ ఇండియా 2018 కృతిక శర్మలు మాట్లాడుతూ లతా పేష్కర్ ఆంగ్ల భాషలో ఇంత వరకు ఆరు పుస్తకాలు రచించారని అవి పిల్లలను స్పూర్తిదాయకంగా ప్రేరేపిస్తాయన్నారు.జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చినా ధైర్యంతో ముందుకు సాగితే విజయం తప్పని సరిగా వరిస్తుందని,అలా లతా పేష్కర్ తన రచనలతో మహిళలలో స్పూర్తి నింపిందన్నారు.ఆమె రచించిన ఏడవ పుస్తకం గ్రోయింగ్ అప్ గ్రోయింగ్ వాయిస్ ప్రచురించబడుతుందన్నారు.
ఇప్పటికే ఆంగ్ల భాషలో రాసిన ఆరు పుస్తకాలు ఎంతో ఆదరణ పొందాయన్నారు.ఆమెను ఇన్స్పిరేషనల్ మహిళా రచయిత్రి అవార్డ్ తో సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రచయిత్రి లతా పేష్కర్ మాట్లాడుతూ తనకు అవార్డ్ అందించినందుకు కృతఙ్ఞతలు తెలియ చేశారు.త్వరలో ప్రచురితమవుతున్న గ్రోయింగ్ అప్ గ్రోయింగ్ వాయిస్ పుస్తకం కూడా అందరి మన్ననలు పొందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.


