దమ్ము, ధైర్యం, నిజాయితీతో రాజకీయం చేస్తున్న ఏకైక వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. తాళ్లూరు మండల కేంద్రంలో ఆదివారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు మేలు చేసారు కాబట్టే నేడు ఆయన పుట్టిన రోజును ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవటానికి ముందుకు అధిక సంఖ్యలో వచ్చారని అన్నారు. తాళ్లూరు మండల కేంద్రంలో కలసి మెలిసి ఎడతాటి పై నిలబడి మండలంలో పార్టీకి తిరుగులేదు అని నిరూపించారని అన్నారు. రాజకీయాలలో అవకాశ వాదులు ఉంటారని, పార్టీ అధికారంలో లేనప్పుడు వెళ్లిపోవటం అధికారంలో ఉన్నప్పుడు ఉండటం, చేస్తుంటారని అన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ బూచేపల్లి కుటుంబం కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. పార్టీ కార్యకర్తలే పార్టీకి బలం అని అన్నారు. 2029లో మరలా వైఎన్ జగన్ ను సీఎంగా చేసుకునేందుకు కృషి చెయ్యాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ 2019లో సీఎం వైఎస్ జగన్ గా ఉన్న సమయంలో నవరత్నాలు ప్రవేశ పెట్టి అమలు చేసి అన్ని వర్గాల ప్రజలను అదుకున్నాడని అన్నారు. పేద వాళ్ల కోసం మరలా సీఎం గా వైఎస్ జగన్ ను చేసుకుందామని పిలుపునిచ్చారు. ముందుగా బ్రహ్మాం గారి గుడి వద్ద ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ర్యాలీగా వచ్చి వెల్లంపల్లి రోడ్ లోనివైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కేక్ నుకట్ చేసి మహిళలకు చీరలను పంచి పెట్టారు. భారీ అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు టీవీ నుబ్బా రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, మాజీ జెడ్పీటీసీ ఎల్ బి వెంకటేశ్వర రెడ్డి, నర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, కోట క్రిష్ణా రెడ్డి, సర్పంచిలు మందా చార్లేన్ సర్జన్, వలి, సుబ్బా రావు, టి ఎస్ వెంకట రామి రెడ్డి, బ్రహ్మా రెడ్డి, ఉప సర్పంచి మండల ఉపాధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, కోట మన్నే రెడ్డి, కోట కోటి రెడ్డి, ఇడమకంటి రాజగోపాల్ రెడ్డి (గోపి అన్న), నాగార్జున, యారం రమణా రెడ్డి, రవి, కోట శ్రీనివాస రెడ్డి, విష్ణు, శరత్, అశోక్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, గోపు శ్రీను, కటకంశెట్టి శ్రీను, కుమ్మిత నాగి రెడ్డి, జయ రామి రెడ్డి, పూనూరి దేవదానం, బాల క్రిష్ణా రెడ్డి, డగ్లస్ తదితరులు పాల్గొన్నారు.











