ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజానికి కృషి చేద్దామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం పంచాయితీ కార్యాలయంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి మంత్రి జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. తల్లి తండ్రులు బాధ్యతగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి వారు భవిష్యత్తులో పోలియో వ్యాధి భారిన పడకుండా కాపాడుదాం. వైద్య ఆరోగ్య సిబ్బంది జిల్లాలో ప్రతి ఇంటికి వెళ్లి 5 ఏళ్ల లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలి. జిల్లాలో 100% పల్స్ పోలియో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు.

