ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాలలో సోమవారం నూతనంగా ఎంపికయిన మహిళా కానిస్టేబుల్స్ కు శిక్షణ ప్రారంభం కానున్నది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హోమంత్రి వంగల పూడి అనిత ముఖ్య అతిథిగా ఒంగోలు రానున్నారు. అమెతో పాటు ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించనున్నారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ రాజా బాబు, జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, ఒంగోలు శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ జిఆర్ రాధిక లు పాల్గొననున్నారు.
నేడు శిక్షణ తరగతులు ప్రారంభించనున్న హోమ్ మంత్రి వంగల పూడి అనిత
21
Dec