అప్పుడే పుట్టిన బిడ్డతో మొదలుకొని ఐదేళ్ల వయస్సుగల పిల్లలకు విధిగా తప్పకుండా ప్రతీ ఒక్క తలిదండ్రులు రెండు పోలియో చుక్కలు వేయిస్తే, మానవ మహమ్మారి పోలియోను పారద్రోళి, సమూలంగా నిర్మూలించి పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటుచేయవచ్చని ప్రకాశం జిల్లా ఐఆర్సీయస్(ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ)ఎగ్జికూటివ్ మెంబరు, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు.
ఈ రోజు దరిశి పట్టణంలోని ప్రధానకూడళ్ళ గడియార స్తంభం సెంటర్లో ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని పదకొండు నెలల చిన్నారి భావ్యజ్ రెడ్డికి కు పోలియో చుక్కలను వేసిన సందర్భంలో కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.ప్రతివక్కరూ అశ్రధ్ధ చేయకుండా పిల్లల బంగారు భవషత్తుకై పోలియో చుక్కల వేయించాలని తలిదండ్రులను కోరారు.ప్రతి బజారులో పోలియో కేంద్రాలను ఏర్పాటుచేసిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి కపురం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎన్నెమ్ లావణ్య, హెచ్ వీ సుహాసిని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
