బేగంపేట డిసెంబర్ 22 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఈ నెల 30 వ తేదీ నుండి భువనగిరి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆహ్వానించారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ నిర్వాహకులు మానేపల్లి గోపి కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆయన వెంట రాంగోపాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
