బ్యాంకు ద్వారా పొదుపు సంఘాలకు అధిక మొత్తంలో రుణాలు అందించటానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు యూనియన్ బ్యాంకు మెనేజర్ వెంకట రెడ్డి తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయంలో సోమవారం పొదుపు సంఘ విఓఏలతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్యాంకు మెనేజర్ వెంకట రెడ్డి మాట్లాడుతూ సకాలంలో రుణాలు చెల్లించి మరలా పొంది రుణ పరపతిని పెంచుకోవాలని కోరారు. ఎపీఎం దేవరాజ్ మాట్లాడుతూ గ్రామ సంఘాలకు రెండు సీఆర్పీలను నియమిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 27న క్లస్టర్ మీటింగ్ దర్శిలో ఉన్నందున అన్ని పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేసుకోవాలని కోరారు. ఎంఎంఎస్ అధ్యక్షురాలు సుజాత, సీసీలు మోహన రావు, కోటేష్ బాబు, అకౌంటెట్ కుమారి పాల్గొన్నారు.

