తాళ్లూరులో ఎబీసీ ఉన్నత పాఠశాలలో సోమవారం సెమీ క్రిస్టమస్ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన సెమిక్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… ప్రేమ, కరుణ, దయతో ఏసుప్రభువు ప్రపంచాన్ని జయించారని ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శమని చెప్పారు. పండుగ విశిష్టతను తెలిపేందుకు సెమిక్రిస్టమస్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తాళ్లూరు వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ …. పాఠశాలలో సెమి క్రిస్టమస్ కార్యక్రమాల నిర్వహణ వలన నేటి తరానికి పండుగ విలువను తెలియజేసే ప్రయత్నం గొప్పదని చెప్పారు. ఆత్మ, జన్యు పరమైన సంబంధాలను తెలిపారు. క్రీస్తు జననం చరిత్ర గురించి వివరించారు. దైవ వాక్య సందేశకుడు, అమెరికా యూనివర్సీటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డానియేల్ వెంకట్ దైవ సందేశాన్ని అందించారు. విద్యార్థులకు మంచి నడవడికపై, తల్లిదండ్రులకు తమ సంతానంపై ఉన్న ప్రేమను చక్కగా వివరించారు. విజయం వైపు నడవటానికి ఏసయ్య కృప అవసరమని చెప్పారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరిగే మంచి చేడుల పట్ల విద్యార్థులు అవగాహనతో ఉండాలని చెప్పారు. డైరెక్టర్ కాలేషాబాబు మాట్లాడుతూ … తల్లి దండ్రులు కష్టాన్ని విద్యార్థులు గుర్తించి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరాలని కోరారు. అద ష్టవంతుడు సంఘం కోసం ఏమి చేస్తాడో కథ రూపంలో వివరించారు. ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వరూపరాణి, చిన్నయ్య, సుష్మిత, షాణి, రామలక్ష్మి దేవ వాక్యాన్ని చదివి వినిపించారు. అనంతరం కేక్ కట్ చేసారు. విద్యార్థులకు కేక్ లు, మిఠాయిలను పంచిపెట్టారు.





