తాళ్లూరు మండలంలోని పలు పాఠశాలల్లో సోమవారం గణిత మోధావి రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు ఎబీసీ ఉన్నత పాఠశాలలో రామానుజన్ జయంతి సందర్భంగా కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు సర్ శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలను వివరించారు. విద్యార్థులు మ్యాథ్స్ లో పట్టు సాధించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. నిజ జీవితంలో మ్యాథ్స్ యొక్క ఆవశ్యకతను వివరించారు. విజేతలైన పలువురు విద్యార్థుల గురించి తెలిపారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మ్యాథ్స్ పట్ల ఆసక్తి పెంచుకుని కష్టంగా కాకుండా ఇష్టంగా ప్రాక్టీస్ చెయ్యాలని కోరారు. మ్యాథ్స్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు, ఇతర ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఎబీసీ హైస్కూల్లో మొదట అడుగు పెట్టిన విద్యార్థి మ్యాథ్స్ పట్ల కష్టంగా ఉంటారని, తర్వాత ఇష్టంగా మార్చుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగిన విషయాలను ఉదహరణలతో వివరించారు. మ్యాథ్స్ ను ఇష్టంగా మార్చుటకు మ్యాథ్స్ లెడెండ్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర రావు చేస్తున్న కృషి ఆదర్శనీమయని కొనియాడారు.డైరెక్టర్ కె. కాలేషాబాబు మాట్లాడుతూ ఇతర సబ్జెక్టులలో రాణించాలంటే మ్యాథ్స్ పట్ల చిన నాటి నుండే ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సబ్జెక్ట్ పట్ల పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల అభ్యున్నతి కోసం ఐఐటీ పౌండేషన్ కోర్సును నడిపిస్తున్నామని .. ఇంకా విద్యార్థులు ఇష్టంగా చదువుకోవాలని కోరారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు చెప్పారు. పాఠశాల పూర్వ విద్యార్థి, అమెరికా యూనివర్సీటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ డానియేల్ వెంకట్ మాట్లాడుతూ ఎబీసీ ఉన్నత పాఠశాలలో చదువుతో పాటు సమస్కారాన్ని నేర్పిస్తారని, జీవితంలో ఎలా ముందుకు సాగాలో ఇక్కడ నుండే నేర్చుకున్నానని అన్నారు. మాథ్స్ ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్ తమకు మ్యాథ్స్ చెప్పిన విధానం ఉన్నత శిఖరాలను దారి తీసిందని, జీవితంలో గణితం ఉపయోగం గురించి వివరించారు.
అనంతరం మ్యాథ్స్ ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, వెంకటరావులను ఘనంగా సన్మానించారు. ముందుగా ఆయా పాఠశాలలలో రామానుజన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయా పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయులకు విద్యార్థులకు మ్యాథ్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.









