పోలీస్ యూనిఫామ్ గౌరవం, బాధ్యతకు ప్రతీక – హోమ్ మంత్రి వంగల పూడి అనిత ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాల లో ఘనంగా మహిళా కానిస్టేబుల్స్ ట్రైనింగ్ ప్రారంభం – ముఖ్య అతిథిగా పాల్గొన్న హోమ్ మంత్రి అనిత, మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, జిల్లా కలెక్టర్, ఎస్పీ

మహిళా పోలీస్ వ్యవస బలోపేతానికి శిక్షణ పాత్ర ఎంతో కీలకమని, పోలీస్ యూనిఫామ్ గౌరవం. బాధ్యతకు ప్రతీక అని పేర్కోన్నారు. ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాల లో మహిళా కానిస్టేబుల్స్ ట్రైనింగ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.
హోమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లాకలెక్టర్ రాజా బాబు, మేయర్ గంగాడ సుజాత, డీసీపి కెజివి సరిత, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హోమ్ మంత్రి అనిత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హోమ్ మంత్రి మాట్లాడుతూ మహిళా కానిస్టేబుల్సు 4 లక్షల మంది పోటీపడితే తమ సామర్థ్యం చాటి 6,100 మంది ఎంపికయ్యారని చెప్పారు. పోలీస్ శాఖలో 20వేల పోస్టుల లోటును పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మిగిలిన 15వేల పోస్టులు త్వరలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ట్రైనీలో పోలీస్ శాఖలోనే మాత్రమే కాక రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. మంచి పనితనంతో ఉత్తమ స్థాయికి ఎదగాలని కోరారు.
ట్రైనీలకు ఇచ్చే స్టయిఫండ్ రూ.4.500 నుండి రూ. 12వేలకు పెంచిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
మంత్రి డోలా వీరాంజనేయస్వామి మాట్లాడుతూ పోలీస్ యూనిఫామ్ గౌరవం, బాధ్యతకు ప్రతీక అని అన్నారు. శిక్షణ సమయంలో క్రమశిక్షణ నిబద్ధతతో ముందుకు వెళ్లి ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ స్థానం పోలీస్ వ్యవస్థకు వెన్నేముక లాంటిదని అన్నారు. 9నెలల శిక్షణను జీవితాన్ని తీర్చిదిద్దికునే అకాశంగా భావించి క్రమశిక్షణ -నిజాయితీతో ప్రజల నమ్మకం పొందే పోలీసులుగా ఎదగాలని కోరారు.
,డీసీపి కెజివి సరిత మాట్లాడుతూ పోలీస్ అంటే భరోసా, భద్రతకు ప్రతీక అని అన్నారు. ప్రజలు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించాలని చెప్పారు. శిక్షణ పూర్తిగా వినియోగించుకుని క్రమశిక్షణతో సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలని కోరారు. జిల్లా కలెక్టర్ రాజా బాబు మాట్లాడుతూ క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యం, ప్రజల విశ్వాసం పోలీస్ శాఖకు కీలకమని చెప్పారు. పరిపాలన- పోలీస్ సమన్వయం అవసరమని వివరించారు. ఉద్యోగం సాధించిన వారందరికి అబినందనలు తెలిపారు.
జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ శాఖకు వెన్నముక అని . శిక్షణ విధానం, సవాళ్లు, సిబ్బంది కొరత, స్మార్ట్ పోలీసింగ్, ప్రజలతో స్నేహ పూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని వివరించారు. పీటీసీ ప్రిన్సిపాల్ ఆర్ రాధిక మాట్లాడుతూ శిక్షణకు 498మంది మహిళా కానిస్టేబుల్స్ కేటాయించినట్లు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, అనకా పల్లి, కర్నూల్, కడప, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల నుండి వచ్చారని తెలిపారు. అత్యధికులు డిగ్రీ అర్హత కలిగిన వారు 25-30 ఏళ్ల వయస్సు ఉన్న వారు అందులో 120 మంది వివాహితులు అని చెప్పారు. ఈస్ట్ గోదావరి జిల్లా కు చెందిన 193 మంది మగ కానిస్టేబుల్స్ కూడ డీటీసి లో ట్రైనింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. ట్రైనింగ్ లో
కరికులమ్ నువివరించారు.
కొత్తగా శిక్షణా పొందుతున్న మహిళా కానిస్టేబుల్స్ ప్రజల భద్రత, శాంతి భధ్రతల పరిరక్షణ కీలక పాత్ర పోషించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చట్టాలపై అవగాహనతో పాటు క్రమశిక్షణ, నిబద్ధత అత్యంత అవసరమని పలువురు వక్తలు కోరారు. కార్యక్రమం అనంతరం హోమ్ మంత్రి అనిత ట్రెనీలతో కలసి ఫోటోలు దిగి వారిని పోత్సహించారు. కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్ ఆర్ రాధిక, వైస్ ప్రిన్సిపాల్ డి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *