జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. అనంతరం సెమి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి, అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసి, క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, సంతోషం, త్యాగం, ప్రేమ మరియు కరుణకు ప్రతీకగా జరుపుకునే మహత్తర పండుగ అని అన్నారు. యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధుల్లేని త్యాగం, శాంతియుత జీవనం వంటి విలువలు మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని పేర్కొన్నారు. అందరూ ఐకమత్యంతో మెలుగుతూ, ఎదుటివారిని క్షమించే గుణాన్ని అలవరచుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం చిన్నారులను జిల్లా ఎస్పీ గారు బహుమతులను అందచేశారు. ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏఅర్. డిఎస్పీ కె శ్రీనివాసరావు,అర్ఐ రమణారెడ్డి సీతారామరెడ్డి, పాస్టర్ యం.ప్రసాద్ ,పోలీస్ కమిటీ చర్చి సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.



