నాగులుప్పలపాడు మండలంలో అమ్మనబ్రోలు గ్రామంలో షకీనా చర్చిలోమండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు సోమవారం రాత్రిజరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ప్రకాశం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి హాజరయు వారి సందేశాన్ని అందించారు. ప్రపంచ శాంతి స్వరూపుడు ఏసుక్రీస్తుని ఆయన మార్గాన్ని అందరూ అనుసరించాలని వారు తెలియజేశారు. పాస్టర్లు క్రైస్తవ గీతాలుపాడి క్రీస్తు సందేశాన్ని అందించారు. కొవ్వొత్తుల వెలిగించి క్రిస్మస్ కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలోటీడీపీ క్లస్టర్ అధ్యక్షులు గుమ్మడి సాయిబాబా , లంబూ నాగేశ్వరరావు చిన్న, సెల్వం, స్వర్ణ కిషోర్ బాబు, ఈదర నాని, నాయకులు పాస్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .
