పేదలకు సహాయం చేయటమే జీనన్ లక్ష్యమని దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కోన్నారు. మండలంలో శివరామపురంలో టిడిపి యూత్ ఆధ్వర్యంలో సెమి క్రిస్టమస్ వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు
ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ప్రశాంత జీవనంలో జీవనం సాగిస్తూ చిన్నారులను చక్కగా చదివించుకోవాలని, మంచి ప్రవర్తన నేర్పాలని ఉన్నతంగా ఎదగాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పయనిస్తున్నామని చెప్పారు. మొగలి గుండాల రిజర్వాయర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. అర్హలైన అందరికి పట్టాలు అందిస్తామని తెలిపారు. దైవ వాక్య ప్రబోధకులు దైవ వాక్య సందేశాన్ని అందించారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు కేక్ కట్ చేసారు. పేదలకు చీరలను పంపిణీ చేసారు. ముందుగా డాక్టర్ లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ ల ను ఎండ్ల బండిపై ఊరేగిస్తూ ఘన స్వాగతం పలికారు. దర్శి ఎఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బా రావు, మండల పార్టీ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, మానం రమేష్, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ ఓబులు రెడ్డి, కళ్యాణ్, గొల్లపూడి వేణుబాబు, లక్ష్మి నారాయణ, ఉప్పనేని తిరుపతి స్వామి, ఎఫ్రాయిమ్, సొసైటీ చైర్మన్ లు గొంది రమణా రెడ్డి (నమర), వల్లభనేని నుబ్బయ్య, క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, రామ కోటి రెడ్డి, నాగార్జున,సాగర్ , పిన్నిక రమేష్. ఫాస్టర్ శాంసన్ , డాని తదితరులు పాల్గొన్నారు.



