ఏడేళ్ల సుదీర్ఘ కాలం అనంతరం ఎట్టకేలకు కేజీబివి టైప్ -2 బాలికల వసతి గృహాం ప్రారంభానికి ముస్తాబు అవుతుంది. 2014-19 సంవత్సరంలో నాడు మంత్రిగా ఉన్న శిద్ధా రాఘవరావు ఆధ్వర్యంలలో బాలికల వసతి గృహాం కేజీ బివీ టైప్-2 రూ.1.97 కోట్లతో మంజూరు అయినది. నిర్మాణం పూర్తి చేసుకుని గత వైసీపీ పాలనలో ప్రారంభానికి నోచుకోక వృథాగా పడి ఉండటంతో పిచ్చి మొక్కలు పెరిగి పాడయి పోయినది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనర్ల రిపేర్ల నిమిత్తం రూ.6 లక్షలు మంజూరు చేయగా పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేసారు. సంక్షేమ అధికారితో పాటు, ఇతర సిబ్బంది కూడ నియమితులైనారు. దీంతో బుధవారం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రారంభించనున్నట్లు తాళ్లూరు మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.
వసతి గృహం పరిసరాలు పరిశీలన…
నూతన వసతి గృహా ప్రారంబోత్సవ నేపధ్యంలో వసతి గృహాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులు, నాయకులు మంగళవారం పరిశీలించారు. వనతి గృహంలో వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 8 నుండి 10 వరకు బాలికలు, వికే జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థునులు ఇప్పటికే వసతి పొంది ఉన్నారు. వసతి గృహాం ప్రారంభం అయినట్లయితే వారు ఇక్కడ వసతి పొందనున్నారని అధికారులు వివరించారు. వసతి గృహాం అనుకుని ఉన్న మధ్యలో ఆగిపోయిన వైద్యాధికారి భవనం వద్ద కూడ పిచ్చిమొక్కలు బాగు చెయ్యాల్సిన ఆవశ్యకతను పరిశీలించారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ నిర్వాహక కార్యదర్శి మానం రమేష్, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి సుబ్బా రావు, నాదేండ్ల శ్రీను, నత్యవర్ధన్, ఎంఈఓ జి నుబ్బయ్య, వికే హైస్కూల్ హెచ్ఎం మిల్టన్, ఎపీ-ఈడబ్యు ఐడీ టి డీఈ పీవీ రమణయ్య, ఏఈ లు జగదీష్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
