ఎన్ హెచ్ 565 బండ్ల వాగు ప్రాంతంలో పులి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పడి ఉండటాన్ని గమనించిన ప్రజలు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ప్రాజెక్టు టైగర్ ఉప సంచాలకులు మొహమ్మద్ అబ్దుల్ రవూఫ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆధారిటి నిర్ధేశించిన స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పోస్టుమార్టమ్ నిర్వహించి పులి మృత దేహాన్ని దహనం చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

