రైతులు పొగాకు సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించి నాణ్యమైన పొగాకు పండించాలి

రైతులు పొగాకు సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు చేపట్టి నాణ్యమైన పొగాకు పండించాలని వక్తలు అన్నారు.
ఒంగోలు పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ ఎస్.రామారావు అధ్యక్షతన “వర్జీనియా పొగాకు రైతాంగానికి మరియు పొగాకు పరిశ్రమకు సేవ చేయడంలో పొగాకు బోర్డు 50 సంవత్సరాల ప్రస్థానం” అనే అంశంపై రైతులకు మరియు క్షేత్ర సిబ్బందికి ఒంగోలు పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ కార్యాలయం ఆవరణలో వర్క్ షాప్ ఏర్పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎస్.రామారావు మాట్లాడుతూ పొగాకు బోర్డు ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, పొగాకు రైతాంగానికి మరియు భారతీయ పొగాకు పరిశ్రమ యొక్క సమగ్ర అభివృద్ధికి గత 50 సంవత్సరాలుగా పొగాకు బోర్డు చేసిన సేవలను వివరించారు.
ముఖ్య అతిధిగా పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ హాజరై రైతులు పొగాకు సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా నాణ్యమైన పొగాకును పండించాలని, పొగాకు పంట నియంత్రణ పాటించాలని, అధిక విస్తీర్ణంలో పొగాకు సాగు చేయొద్దని మరియు అనధికార
బ్యారన్కట్టవద్దని కోరారు. గుంటూరు పొగాకు బోర్డు కేంద్రకార్యాలయం మేనేజర్ ఎక్సటెన్షన్ జె.సురేఖ
వివిధ స్కీములలో రైతులకు పొగాకు బోర్డు అందిస్తున్న సబ్సిడీల గురించి వివరించారు.
ఎన్నారై సీఏ పరిశోధన కేంద్రం కందుకూరు హెడ్ , శాస్త్ర వేత్త డాక్టర్ ఎం.అనురాధ, ఐటిసి జిపిఐ మరియు పి ఎస్ ఎస్ కంపెనీల ప్రతినిధులు, పొగాకు బోర్డు వివిధ వేలం కేంద్రాల నుండి వేలం నిర్వాహణాధికారులు, క్షేత్రసిబ్బంది, రైతులు పాల్గొన్నారు.దీనికోసం పొగాకు పంటకు ముందు పచ్చి రోట్ట పైరు సాగుచేయాలని కోరారు. నాట్లు వేసేటప్పుడు నాణ్యమైన నారును ఎంచుకొని మరీ ముఖ్యంగా ట్రే విధానం ద్వారా సాగుచేసి వాడాలి. దీనివలన పంట అంతా ఒకేసారి పంటకు వస్తుందని తెలిపారు. పొగాకు ప్రధాన పొలంలో ఎరువులను సమతుల్యంగా వాడాలని ముఖ్యంగా పొటాష్ ఎరువు వాడాలని తప్పనిసరిగా వాడాలని కోరారు. దీనివలన పొగాకు పంటకు చీడ పీడలను తట్టుకొనే శక్తి, బెట్ట పరిస్థితులను తట్టుకొనే శక్తి పెరుగుతుందని, దిగుబడి తోపాటు పొగాకు నాణ్యత పెరుగుతుందని తెలిపారు. పొగాకు లో విచ్చలవిడిగా పురుగు & తెగుళ్ల మందులు వాడకూడదని, అవసరమైన అప్పుడే సిఫారసు చేసిన మందులను మాత్రమే వాడాలని కోరారు. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి పురుగుల మరియు తెగుళ్ల నివారణ చేపట్టాలని కోరారు.పొగ మల్లె నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. అలానే పక్వానికి వచ్చిన ఆకులనే రెలచాలని, బారన్ లో పరిధికి మించి అల్లిన కర్రలను పెట్టకూడదని, క్యూరోమీటర్ ను ఖచ్చితంగా వాడాలని దీని వలన అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు అని తెలిపారు. పొగాకు గ్రేడింగ్ చేసే సమయం లో అన్య పదార్థాలను తీసివేయాలని కోరారు. పొగాకు బేళ్ళు కట్టేటప్పు డు తేమ లేకుండా చూడాలని కోరారు.
శాస్త్రవేత్తలు రైతు సోదరులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. అంతేకాకుండా పొగాకు సాగు తో పాటు మొక్కల నాటడం ఆవశ్యకత వంటి సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలల పొగాకు రైతులు మరియు పొగాకు బోర్డు క్షేత్ర సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *