మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా – గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించిన, రవాణా చేసినా కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు-మాదకద్రవ్యాల నిర్మూలనకు… ప్రకాశం జిల్లా పోలీసుల అడుగులు

ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించి విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగింది.
ఈ తనిఖీలో 2025 సెప్టెంబర్ 19 నుండి ఇప్పటి వరకు ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నమోదైన 06 గంజాయి కేసులలో మొత్తం 25 మంది నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 09 కిలోల 87 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే, 2025 సెప్టెంబర్ 5 నుండి ఇప్పటి వరకు రైల్వే మార్గాల ద్వారా గంజాయి అక్రమ రవాణా అరికట్టుటకు, పలు రైళ్లలో తనిఖీలు నిర్వహించి, నమోదైన 10 కేసులలో 12 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 72 కిలోల 647 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. రైలు ద్వారా గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణా సమాజానికి పెద్ద ప్రమాదమని తెలిపారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ దిశగా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైల్వే మార్గాలు, బస్ స్టాండ్లు, లాడ్జీలు, అనుమానాస్పద ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పద వ్యక్తులు, పార్సిళ్లు, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.

గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసే, విక్రయించే, నిల్వ చేసే లేదా వినియోగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 కు తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు.

మత్తు పదార్థాల నిర్మూలన ద్వారా ఆరోగ్యవంతమైన, నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని జిల్లా ఎస్పీ  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *