హైదరాబాద్ డిసెంబర్ 24, (జే ఎస్ డి ఎం న్యూస్) :
పోలీసులు సివిల్ వివాదాలలో తలదూర్చవద్దని తెలంగాణ రాష్ట్ర పోలీసులను డీజీపీ శివధర్ రెడ్డి, అంతర్గత లేఖ ద్వారా హెచ్చరించారు. సివిల్ వివాదాల్లో (కుటుంబ సంబంధాలు, ఆస్తి విభజన, భూమి వివాదాలు మొదలైనవి) పోలీసులు తలదూర్చకూడదని, అటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.గీత దాటితే వేటు తప్పదు. అనే సూక్తి నీ గుర్తుచేస్తూ,పోలీసు స్టేషన్లను పంచాయితీ అడ్డాలుగా మార్చి సివిల్ తగాదాలు సెటిల్ చేస్తే ఎవరైనా (హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకూ) బాధ్యుడవుతారని హెచ్చరించారు.సివిల్ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయి. ప్రతి పోలీసుకూ ఇది తెలుసు. అయినా వాటిపై దృష్టి సారించి, పోలీసు స్టేషన్‌లను సెటిల్మెంట్ సెంటర్లుగా మార్చడం తప్పు. ఇలాంటి ఫిర్యాదులు వస్తే, పార్టీలు/పంచాయితీలకు మళ్లించాలి. అని పేర్కొన్నారు.
ప్రస్తుతం వివాదాలను పరిష్కరించిన స్టేషన్లు, అధికారులపై తక్షణమే వేటు (కఠిన చర్యలు) పడుతుంది. ఎస్పీలు, సీపీలు, హోం గార్డులు ఎవరూ మినహాయింపు లేదు.అని తెలిపారు. పోలీసు యూనిఫామ్, అవినీతి కలిసి ఉండకూడదు.అని డి జి పి హెచ్చరించారు.
