రాష్ట్రంలో వసతి గృహాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన మార్పులు- రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి

రాష్ట్రంలో వసతి గృహాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
బుధవారం తాళ్ళూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కస్తూరిబాయి బాలికా వసతి గృహం టైప్-2 ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్చార్జిగొట్టిపాటి. లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి శ్రీరాములుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాదాపు 8 సంవత్సరాల క్రితం తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాలికా విద్యా ప్రసాదంలో భాగంగా ఈ బిల్డింగ్ మంజూరు చెయ్యటం జరిగిందన్నారు. ఈ బాలికా వసతి గృహం యొక్క ప్రాధాన్యతను గుర్తించి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళి ఆయన సహకారంతో మిగిలిన ఈ నిర్మాణం పూర్తి చేశారన్నారు. ఈరోజు ఈ హాస్టల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. వసతి గృహాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పిల్లలకి అవసరం అయిన త్రాగు నీరు వాటర్ ప్లాంట్, నాణ్యమైన బియ్యం అదేవిధంగా విద్యార్థులకి నర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ ను అందిస్తున్నారు. పరీక్షలు దగ్గరపడిన నేపద్యంలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకుని గుణాత్మక, నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వసతి గృహం కూడా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందన్నారు. నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ లక్ష్మీ బీసీ కాలేజీ బాయ్స్ వసతి గృహం కావాలని అడిగారనీ, ఎంత మంది బీసీ విద్యార్థులు ఉన్నా కూడా ఎస్సీ హాస్టల్ లో అడ్మిషన్ కల్పించి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నడుపుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సంక్షేమం రెండు కళ్ళు లాగా బావిస్తున్నారన్నారు. రోడ్లు నిర్మాణం, పింఛన్లు, అన్నా క్యాంటీన్లు, అన్నదాతనుఖీభవ, దీపం-2, తల్లికి వందనం, ఉచిత బస్సు లాంటి అనేక సంక్షేమ, అభివృద్ధి పనులు అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఒంగోలు పార్లమెంట్ నభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ హాస్టల్ లో విద్యార్థులకి అవసరం అయిన వనతులు పూర్తి స్థాయిలో కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. హాస్టల్స్ అభివృద్ధి కోసం మంత్రి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. దర్శి నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తున్న ఇంచార్జి గొట్టిపాటి. లక్ష్మీ ని ఆయన అభినందించారు. దర్శి నియోజకవర్గ ఇంచార్జి గొట్టిపాటి. లక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య తోపాటు, భద్రమైన వసతి, మంచి భవిష్యత్ విద్యార్థులకి ఇవ్వాలని స్పష్టమైన లక్ష్యం తో పని చేస్తుందన్నారు. పేద, వెనుకబడిన బాలికలను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం చాలా మెచ్చుకోదగిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తాళ్లూరు మండల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, గత ఐదేళ్లలో వసతి గృహం ప్రారంభానికి నోచుకోలేదని, తమ ప్రభుత్వంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ల సహకారంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నామని అన్నారు. తాళ్లూరు మండలంలో మొగలి గుండాల రిజర్వాయర్, 33/11 కేవి నబ్ స్టేషన్ త్వరలో పూర్తి అవుతాయని, మిగిలిన మౌళిక వనతులు కూడ కల్పించటానికి పూర్తి ప్రణాళికలు ఉన్నాయని అన్నారు.
ముందుగా వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి వనతి గృహాన్ని ప్రారంభించారు.

కార్యక్రమంలో దర్శి ఎఎంసీ చైర్మన్ నాగవేణి సుబ్బారావు, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, పార్టీ నాయకులు మానం రమేష్ బాబు, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, టిడిపి ముండ్లమూరు అధ్యక్షుడు కూరపాటి శ్రీను, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ బి ఓబులు రెడ్డి, డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైన్ చైర్మన్ టీ శివ నాగి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు గొంది రమణా రెడ్డి(నమర), వల్లభనేని సుబ్బయ్య, పిన్నిక రమేష్, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, ప్రభాకర్ రెడ్డి, పోశం శ్రీకాంత్ రెడ్డి, సాగర్, కైపు రామ కోటి రెడ్డి, నాగార్జున రెడ్డి, గొల్లపూడి వేణుబాబు, వెలుగు సుబ్బా రావు, వంగపల్లి నాగేశ్వర రావు, కళ్యాణ్ చక్రవర్తి, తిరుపతి స్వామి, లక్ష్మినారాయణ, రామయ్య, కాశి రెడ్డి, ఎఎంసీ డైరెక్టర్లు బి.ఎన్ హనుమా రెడ్డి, షేక్ కాలేషా వలి, తహసీల్దార్ రమణా రావు. ఎంపీడీఓ అజిత, ఎంఈఓలు సుబ్బయ్య, సుధాకర్ రావు, హెచ్ఎం ఆరోన్ మిల్టెన్, పీఎంసీ చైర్మన్ సత్యవర్ధన్ రావు, సుబ్బా రావు తదితరులు పాల్గొన్నారు.

కృతజ్ఞతలు తెలిపిన కళాశాల విద్యార్థులు …

కళాశాల వసతి గృహా ప్రారంభం సందర్భంగా కళాశాల విద్యార్థులు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్లకు కళాశాల గేటు ప్రారంగణంలో ఆపి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ వేణుగోపాల్ సిబ్బంది, గ్రామ నాయకుడు ఐ శ్రీనివాస రెడ్డిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *