చిలకలూరి పేట వద్ద కారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మేడగం రామి రెడ్డి కుటుంబాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం పరామర్శించారు. మాగుంట అనుచరుడైన మేడగం నుబ్బా రెడ్డి కుమారుడు కావటంతో ఆయన ప్రత్యేకంగా వారి నివాసానికి వెళ్లి సుబ్బా రెడ్డిని ఓదార్చారు.ధైర్యంగా ఉండాలని కోరారు.
ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, నర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డి, పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీ అనుచరులు చంటి, కాశిరెడ్డి, నాయుడు, ప్రభాకర్ రెడ్ది తదితరులు ఉన్నారు.


