క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన ఏసుక్రీస్తు మార్గం ఆచరణీయమైనదనీ, ప్రజలందరూ శాంతి, సమాధానాలతో, ప్రశాంత వాతావరణములో, ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, సహనం మరియు త్యాగం వంటివి క్రీస్తు మానవాళికి అందించిన మహోన్నత సందేశమన్నారు. ఈ క్రిస్మస్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నారు.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ప్రధాన చర్చిలు మరియు ప్రార్థనా మందిరాల వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
