లోకంలో పాపులను రక్షించి, ధర్మ స్థాపనకై యేసు ప్రభువు జన్మించిన రోజును క్రిస్మస్ పండుగగా ప్రపంచ ప్రజలు భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారని ఒంగోలు ఎం. పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.
మానవాళి మనుగడకు ప్రతీకలైన సకల జీవులపై కరుణ, నీతి, ప్రేమ, శాంతి, సహాయం, సహకారం, సహనం మొదలగు మంచి గుణాలతో ప్రజలందరూ జీవించాలని క్రీస్తు బోధించాడని అన్నారు.
జీవితంలో అనుసరణీయమైన క్రీస్తు బోధనలను అందరూ అనుసరించుచూ, దేవుని ఆరాధనతో క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుచూ, జిల్లా క్రైస్తవ సోదర, సోదరీమణులకు మరియు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు.
